బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం

400
aus vs ind
- Advertisement -

భారీ టార్గెట్..ఓడిపోతామని తెలిసినా పసికూన బంగ్లాదేశ్‌ పోరాడిన తీరు అద్భుతం. లక్ష్యం ఎంతైనా సరే.. పోరాటం కొనసాగించాలని, మన శక్తి మేర ఆడాల్సిందేనని.. బంగ్లా టీం చూపించిన ఆటతీరు అందరిని ఆకట్టుకుంటోంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది బంగ్లా. బలమైన జట్టును ఢీకొన్నామనే భావన ఏ మాత్రం లేకుండా బంగ్లా ఆడిన తీరు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను థ్రిల్‌కు గురిచేసింది.

382 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆరు రన్‌ రేట్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు బంగ్లా బ్యాట్స్‌మెన్‌.భారీ లక్ష్యమైన బంగ్లా బ్యాట్స్‌మెన్ పోరాడిన తీరు అమోఘం. ఓడిన క్రికెట్ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ముష్ఫికర్‌ రహీం (102 నాటౌట్‌; 97 బంతుల్లో 9×4, 1×6) అజేయ సెంచరీ సాధించగా, తమీమ్ ఇక్బాల్ ( 62 ), మహ్మదుల్లా ( 69 )లు అర్ధ సెంచరీలతో రాణించారు.ఫలితంగా 50 ఓవర్లలో 333 పరుగులు చేయగలిగింది బంగ్లాదేశ్.

అంతకముందు టాస్ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (147), ఉస్మాన్ ఖవాజా ( 89 ),కెప్టెన్ ఆరోన్ ఫించ్ 53 ) రాణించడంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 381 పరుగుల భారీ స్కోరు చేసి బంగ్లాదేశ్‌పై 48 పరుగుల తేడాతో గెలుపొందింది.

- Advertisement -