భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అలాంటి భారతీయ భాషలకు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలోని పాఠాశాల్లో పంజాబీ భాషను భోధించేందుకు అక్కడ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చేందిన దేశాల్లో పంజాబీ భాషను పాఠశాల స్థాయిలో భోదిస్తున్నారు. అయితే తాజాగా ఆస్ట్రేలియా ఈనిర్ణయం తీసుకోవడంతో ఆదేశాల సరసన నిలిచింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పాఠశాల్లో ప్రీప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పంజాబీ భాషను సిలబస్‌లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్ట్రేలియాలో అత్యధికంగా మాట్లాడే భాషలో పంజాబీ ఐదవ స్థానంలో ఉండగా… పంజాబీ మాట్లాడే ప్రజలు సూమారుగా 2.39లక్షల మంది ఉన్నారు. అయితే ఇక్కడ గత ఐదేళ్లలో పంజాబీ మాట్లాడేవారి సంఖ్య దాదాపుగా 80శాతం పెరిగినట్టు అస్ట్రేలియా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి…