‘బెండకాయ’ తింటే ఇన్ని ఉపయోగాలా!

71
- Advertisement -

మన శరీరానికి సరైన పోషకాలు అందాలంటే మనం తినే ఆహారంలో అధికంగా ఆకు కూరలు లేదా కూరగాయలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అధికంగా తినే జంక్ ఫుడ్ కన్నా సహజంగా లభించే కూరగాయల మన శరీరానికి అధిక ప్రయోజనలు కలుగుతాయి. అయితే కూరగాయలలో కొన్ని కూరగాయలను తినడానికి కొంత మంది ఆసక్తి చూపరు. అలాంటి కూరగాయలలో బెండకాయ ఒకటి.. దీనిలో ఉండే జిగురు కారణంగా బెండకాయను తినడానికి ఇష్టపడరు. అయితే దీనిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవాళ్లకు బెండకాయ ఎంతగానో మేలు చేస్తుంది. బెండకాయలో ఉండే జిగురు పదార్థం మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తుంది. ఇక బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. .

తద్వారా మలబద్దకం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. బెండకాయలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది.. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పెద్ద పేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారు బెండకాయ కూర తినడం ఉత్తమం అని నిపుణులు సైతం చెబుతున్నారు. గర్బవతులు బెండకాయ కూర తినడం వల్ల ఫోలేట్ సమృద్దిగా అంది.. బిడ్డ మెదడును చురుకుగా ఉంచుతుంది. అంతే కాకుండా బెండకాయలో ఉండే ఫోలిక్ యాసిడ్ శిశువు నాడీ వ్యవస్థను మెరుగు పరచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్న బెండకాయను తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బెండకాయ కూర తినడానికి అందరూ ఆసక్తి కనబరచడం మంచిదని నిపుణుల సలహా.

Also Read:సమ్మర్ ఎంటర్‌టైనర్‌.. ‘ఏం చేస్తున్నావ్ ’

- Advertisement -