మహిళల వరల్డ్‌ కప్‌ విజేతగా ఆస్ట్రేలియా..

100
- Advertisement -

మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది. ఈరోజు క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 71 పరుగుల తేడాతో చిత్తు చేసి కప్‌ను గెలుచుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్ హేయెన్స్ లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా అలెక్స్ హీలీ ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవాలి. ఇప్పటివరకు మెన్స్ క్రికెట్ లోనూ సాధ్యపడని రికార్డును ఆమె సొంతం చేసుకుంది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 43.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై.. ఆస్ట్రేలియాపై 71 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్‌ జట్టులో నాటలీ స్కివర్ 121 బంతుల్లో 148 (నాటౌట్‌) పరుగులతో నిలిచింది. స్కీవర్‌ ఒంటరి ప్రయత్నం చేసినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు.

ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అలీసా హీలీనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. సిరీస్ మొత్తం నిలకడగా ఆడినా ఆమెకే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందించారు. కాగా, ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్‌లో ఏడో టైటిల్‌ను చేజిక్కించుకుని తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది.

- Advertisement -