‘అత్తారింటికి దారేది’..లైకాకు భారీ నష్టం

419
Simbu1_0.jpeg
- Advertisement -

తెలుగులో పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన విజయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈమూవీ అప్పటి వరకు టాలీవుడ్ లోనే అతి ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. సమంత, ప్రణితలు హీరోయిన్లుగా నటించిన ఈమూవీని బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ఈమూవీలో తెలుగులో భారీ విజయం సాధించడంతో తమిళ్ లో రిమేక్ చేశారు. వందా రాజావాదన్ వరువేన్ పేరుతో శింబు హీరోగా లైకా సంస్ధ నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాణ సంస్థ భారీ నష్టాలను మూటగట్టుకుంది. సినిమా రీమేక్ ద్వారా ఏకంగా రూ.14 కోట్ల నష్టం వచ్చినట్టు లైకా సంస్థ అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -