“అల వైకుంఠపురంలో”.. సామజవరగమన సాంగ్

964
samajavaragamana song
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో అల..వైకుంఠపురంలో అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను అల్లు అరవింద్, కె.రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ అందరిని అకట్టుకుంటుంది.

ఇక బన్నీ తన ఫ్యాన్స్ కు తాజాగా మరో గిప్ట్ ఇచ్చాడు. ఈసినిమా నుంచి సామజవరగమన అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈపాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో భారీగా అంచనాలున్నాయి. సంక్రాంతికి కానుకగా ఈమూవీని విడుదల చేయనున్నారు.

https://youtu.be/Thf60JU8E98

- Advertisement -