నేటి నుంచి బతుకమ్మ సంబురాలు

375
Batukamma8
- Advertisement -

తెలంగాణ ఆడపడచులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఉత్సవాలు నేటితో ప్రారంభంకానున్నాయి. 8రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను చాలా గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకుంటారు. ముందుగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతోంది.

ఈరోజు నుంచి అక్టోబర్ 6 వరకూ బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకోనున్నారు. తెలంగాణతోపాటూ… ముంబై, బెంగళూరు, కర్నాటకలోనూ బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు కావాల్సిన సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి రోజున అంటే అక్టోబర్ 6న ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్​బండ్​వరకు ర్యాలీ ఉండబోతోంది. ముగింపు వేడుకలు ట్యాంక్​బండ్​పై జరగనున్నాయి. ఇండియాతోపాటూ… మరో ఆరు దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరగబోతున్నాయి.
8 రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలు:

1. ఎంగిపూల బతుకమ్మ- ఈ రోజు మహా అమావాస్యను పురస్కరించుకుని మొదటి బతుకమ్మను తయారుచేస్తారు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని అంటారు. నువ్వులు, బియ్యపుపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
2. అటుకుల బతుకమ్మ- 29.09.19: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండువ రోజు బతుకమ్మ చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేస్తారు.
3. ముద్ధపప్పు బతుకమ్మ- 30.09.19: ఇక మూడవ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
4. నానబియ్యం బతుకమ్మ- 01.10.19: నాలుగోరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
5. అట్ల బతుకమ్మ- 02.10.19: ఇక ఐదవ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
6. అలిగిన బతుకమ్మ- 03.10.19: ఆరో రోజు ఆశ్వయుజ పంచమి వస్తుంది. నైవేద్యం ఏమీ సమర్పించరు.
7. వెన్న ముద్దల బతుకమ్మ- 04.10.19: ఇక ఏడవ రోజు నువ్వులు, వెన్న కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
8. సద్దుల బతుకమ్మ- 05.10.19: ఎనిమిదవ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. మొత్తం ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం ప్రత్యేకంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

- Advertisement -