ఎంపీ సీఎం రమేష్‌పై దాడి

212
Attack on MP Cm Ramesh in Jammalmadugu
- Advertisement -

ఏపీ టీడీపీలో కేబినెట్ విస్త‌ర‌ణ పెద్ద చిచ్చే రేపింది. సీనియ‌ర్లకు హ్యాండిచ్చి.. బాబు కొత్త ముఖాల‌కు చోటివ్వ‌డంపై సీనియర్లు భగ్గుమంటున్నారు. తమకు కాదని మంత్రి పదవి ఫిరాయింపు దారులకు ఇవ్వడంపై సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కుతున్నారు.   ఇప్పటికే సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు, సీఎం చంద్రబాబుకు పంపాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సామాన్య పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటించారు.

ఇక తాజాగా వైఎస్సార్‌ జిల్లా  జ‌మ్మ‌ల మ‌డుగులో శుక్రవారం నిర్వ‌హించిన‌ టీడీపీ నియోజకవర్గ స్ధాయి స‌మావేశం ర‌సాభాసగా మారింది. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు  ఎంపీ(రాజ్యసభ) సీఎం రమేశ్‌పైకి  కుర్చీలు విసిరేశారు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. ‘సీఎం రమేశ్‌.. గో బ్యాగ్‌..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

టీడీపీనే నమ్ముకుని పార్టీ ఉన్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమకు పదవులు ఇవ్వకుండా నిన్నమొన్న చేరినవారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి. ఆదినారాయణరెడ్డికి.. ఎంపీ సీఎం రమేశ్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని, ఆదికి మంత్రి పదవి దక్కడంలో రమేశ్‌ ముఖ్యపాత్ర పోషించాడని రామసుబ్బారెడ్డి విమర్శించారు.

ఇటీవలే గుంటూరు మండలం లో అంబేడ్కర్ స్మృతి వనం పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనందబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు మండలం శాకమూరులో అంబేడ్కర్ స్మృతి వనం భూమి పూజకు ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనంద్ బాబు కాన్వాయ్ ను శ్రవణ్ కుమార్ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటనకు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -