మోదీ భద్రత విషయంలో నిర్లక్ష్యం.. బీజేపీ ఆందోళన..

22

పంజాబ్ ప్రభుత్వం దేశ ప్రధాని మోదీ భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిందంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసన చేపట్టగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఎమ్మెల్సీ మాథవ్ హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్యంలోని పంజాబ్ ప్రభుత్వం కావాలానే పాకిస్తాన్ సమీపంలో ప్రధాని భధ్రత పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసు వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుచేతల్లో ఉంచుకోవడం వల్లనే ఈ తరహా పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు.