ATA: ఘనంగా మహిళా దినోత్సవం

43
- Advertisement -

న్యూజెర్సీ లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యములో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఉగాది వేడుకలను ఎడిసన్ లో ని రాయల్ అల్బెర్ట్స్ ప్యాలేస్ లో ఏప్రిల్ 2 న దిగ్విజయంగా నిర్వహించారు. సుమారు 1200 మంది జనులు అన్నివర్గాల నుండి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకను ఆటా అధ్యక్షురాలు శ్రీ మతి మధు బొమ్మినేని గారు దీపాలను వెలిగించి ప్రారంభించారు.ఆ తరువాత న్యూ జెర్సీ / న్యూ యార్క్ ఆటా బృందం వారు సాంప్రదాయ పద్దతిలో ఉగాది పూజలను జరుపగా అను దాసరి బృందం వారు ప్రార్థనా గీతాన్ని ఆలపించి శ్రోతలను ప్రేక్షకులను మైమరపింప చేసి ప్రసంసలు పొందారు. ముఖ్యప్రభుత్వ వ్యవహరాల అధికారి మరియు రాష్ట్రపతికి ప్రత్యేక సహాయకులు (చీఫ్ గవర్నమెంట్ అఫైర్స్ ఆఫీసర్ అండ్ స్పెషల్ అసిస్టెంట్ టు ప్రెసిడెంట్ ) అయిన కెల్లీ డ్రేక్ఫోర్డ్ గారు ముఖ్య అథిదిగా విచ్చేసి భిన్నత్వం లో ఏకత్వం , అందరినీ కలుపుకొని పని చేయటం మరియు మహిళా సాధికారత గురించి ప్రేరణ కలిగించే విధంగా ప్రసంగించారు. ఈ ప్రసంగానికి ప్రేక్షకుల మన్ననలు లభించడమే గాక వివిధ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరిగింది.

అన్ని వయస్సుల వారి ఫ్యాషన్ షో, ముగ్గుల పోటీ లు, పిన్నలు పెద్దల చే వివిధ నృత్య కర్యక్రమాలు, క్విజ్ పోటీలు , పిల్లలకు మ్యూజికల్ చైర్స్ వంటి ఆటల పోటీలు ఇంకా మరెన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు బహూకరించారు. అలానే స్వఛ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహించిన నేటితరం పిల్లలందరికీ ఆటా అధ్యక్షులు మెమెంటో లు బహూకరించారు మరియ ఈ తరం పిల్లలు, యువత ఆటా లో వాలంటరీగా వారి పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇలాంటీ అన్ని ప్రయత్నాలు కూడా సఫలీక్రుతమయ్యాయి.

మహిళలు ధైర్యానికి పెట్టింది పేరు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావడానికి గీతారెడ్డి, మీనాక్షి తునికి, అర్చన వేముల,అను దాసరి, నందిని దర్గుల, కవిత లింగంపల్లి, హరిని ఆఎనూతి, లలిత రెడ్డి, నివేదిత గౌడ్, అపర్న కనుగొ, షిల్పి కుందూర్, స్వప్న తుమల్ల, సరిత ఆర్జుల, జ్యోతి కెథిది, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీలత రెడ్డీ, మాధవి ఆరువ, మాధవి గొట్టిముక్కుల, ఉష అప్పిడి, చిత్ర జంబుల వంటి బృందంలోని మహిళమణులకు ధన్యవాదములు.

న్యూ జెర్సీ లో ఉన్న మూడు అతి ముఖ్యమైన నాట్యకళాశాలలు వాటి అధ్యక్షులైన సిద్ధేంద్ర కూచిపూడి అకాడమి నడుపుతున్న స్వాతి అట్లూరి గారికి, కళాంజలి స్కూల్ ఆఫ్ డాన్స్ నడుపుతున్న సుధ దేవులపల్లి గారికి, సెంటెర్ ఫొర్ కూచిపూడి డాన్స్ నడుపుతున్న ఇందిర శ్రీరాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి ఆధ్వర్యములో నృత్యాల ప్రోగ్రామ్స్ సక్సెస్ అయ్యాయి. అలాగే పెద్దల నృత్యాల సమన్వయకర్త అయిన శ్రీమతి లలిత గారికి మరియు మూడు విభిన్న వయసు వర్గాలకి నృత్యం కూర్చిన ఎనిమిదవ తరగతి చిన్నారి ఇషిత రెడ్డి మూలేకి ప్రత్యేక ధన్యవాదాలు.

ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా గారు, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి గారు, నారాయణ పిరమర్ల గారు, బోర్డు అఫ్ ట్రస్టీ అనిల్ రెడ్డి , ఆట ప్రసారమాధ్యమా చైర్ రామ్ ముందర్తితో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆట సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వడానికి ముఖ్య కారణం ఆట సభ్యుల మధ్య సమన్వయం. ఆట ప్రాంతీయ సమన్వయకర్త గీతా రెడ్డి , మీనాక్షి గారికి, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు శరత్ వేముల, రఘువీర రెడ్డి, వినోద్ కోడూరు, శ్రీనివాస్ దర్గుల, సుధాకర్ పెర్కారి, బిజినెస్ కార్యదర్శి హరీష్ బాతిని , సలహాదారు సురేష్ జిల్లా , ప్రాంతీయ సలహాదారులు రత్నకుమార్ కుదుముల, నారాయణ పిరమర్ల మరియు విలాస్ జంబుల, ప్రాంతీయ అధ్యక్షులు ప్రవీణ్ ఆల మరియు అంతర్జాల (వెబ్) కార్యదర్శి రాజ్ చిలుముల ప్రత్యేక ధన్యవాదములు.

ఈ కార్యక్రమములో వచ్చిన వారందరికి రాఫల్ ద్వారా బహుమతులు ఇవ్వడానికి సహకరించిన వివిధ దాతలకు, స్పాన్సర్స్ కి విలాస్ జంబుల ( ప్రాంతీయ సలహాదారులు ) ధన్యవాదములు తెలిపారు.

ఉగాది పచ్చడితో సాంప్రదాయ మిఠాయిలతో కూడిన విందును కూడా వడ్డించడం జరిగింది . ఈ కార్యక్రమం మొత్తానికి దిగ్విజయంగా జరిగి పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమ నిర్వహణలో ఆటా పెట్టింది పేరు అని పేరు నిలుపుకుంది. అందరూ కూడా ఆటాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటా స్పాన్సర్స్ కి మరియు ప్రసారమాధ్యమ (ప్రింట్, రేడియో & ఎలక్ట్రానిక్ ) భాగస్వాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -