న్యూజెర్సీలో దసరా ఉత్సవాలు…

247
ATA celebrates Dussera in New Jersey
- Advertisement -

ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా తదితర ప్రాంతాల్లో నివాసముంటున్న తెలుగు వారు సుమారు 1000 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటా, నాట, టాటా సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జులై 6,7,8 తేదిలలో జాతీయస్థాయి సమావేశం, యువజన సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆటా సభ్యులు, నిర్వహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

దుర్గా పూజతో ప్రారంభమైన ఉత్సవాలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. పూజ అనంతరం జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆటా ప్రాంతీయ కో-ఆర్డినేటర్స్ రవీందర్ గూడూర్ మరియు విలాస్ రెడ్డి జంబుల అతిథులందర్నీ ఆహ్వానించారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం అనంతరం వారాంతంలో మూడు రోజుల మెగా కార్యక్రమాన్ని ఫిలడెల్ఫియాలో నిర్వహించాలని నిర్ణయించారు.

ATA celebrates Dussera in New Jersey

పూజారి వేలమూరి దసరా ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రజలకు వివరించారు. విజయం పొందాలనే ప్రతీ కార్యక్రమాన్ని దసరా రోజునే ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఆటా అధ్యక్షుడు ఎలెక్ట్ పరమేశ్ భీంరెడ్డి తన సందేశాన్ని తెలియజేశారు. వచ్చే ఏడాదిలో చేపట్టబోయే మెగా కార్యక్రమం గురించి సభ్యులకు వివరించారు. దసరా కార్యక్రామన్నీ విజయవంతం చేసేందుకు విశేషంగా కృషిచేసిన రవీందర్ గూడురు, విలాస్ జంబుల, రమేష్ మాగంటిలను సభ ముఖంగా అభినందించారు.

ఆటా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికి ఆయన అభినందనలు తెలిపారు. చికాగో, డల్లాస్, అట్లాంట, వాషింగ్టన్ మొదలైన సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. మీడియా సహకారం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు డాక్టర్ కోవ లక్ష్మణ్ మరియు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిది రఘునందన్ రావు ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు. తెలుగు హీరోయిన్ అంకిత జవేరి మరియు గాయకులూ వేణు శ్రీరంగం, ఆదర్షిని, పారిజాత , షాలిని మరియు విష్ణు ప్రియా పాడిన పాటలు అలరించాయి.

ఆటా సభ్యులు పూర్వ అధ్యక్షులు పెర్కారి సుధాకర్, డా: రాజేందర్ జిన్నా, సహాయ కార్యదర్శి వేణు సంకినేని, సహాయ కోశాదికారి శ్రీనివాస్ దార్గుల, కార్యవర్గ సభ్యులు పురుశురం పిన్నపురెడ్డి, వినోద్ కోడురు, రవి పట్లోల, శరత్ వేముల , రఘువీర్ రెడ్డి, విజయ్ కుందూరు, ప్రాంతీయ అంతర్జాతీయ సమన్వయకర్త శ్రీకాంత్ గుడిపాటి, ప్రాంతీయ సలహాదారుడు రాజ్ చిలుముల, స్టాండింగ్ కమిటీ చైర్స్ రమేష్ మాగంటి, ఇందిరా దీక్షిత్, రాజశేకర్ శీలం, విజయ్ గంగుల, వెంకట్రాం వేములారం, ప్రదీప్ సువర్ణ, రవి పెద్ది, రత్నాకర్ , భగవాన్ పింగ్లే, సురేష్ జిల్లా, నారాయణ పిర్లమర్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతంగావాడానికి దోహదం చేసారు. ఈ కార్యక్రమానికి నాటా, టాటా , తానా, నాట్స్ , కళాభారతి నాయకులు హాజరయ్యారు. టీడీఫ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అనుగు, నాట్స్ నాయకులు మోహన్ మన్నవ ఇంకా పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు .

- Advertisement -