ఆడిలైడ్ టెస్టులో చారిత్రాకవిజయాన్ని సాధించిన భారత్‌కు ఎదురుదెబ్బతగిలింది. తొలిటెస్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ అశ్విన్,మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ పెర్త్‌లో జరిగే రెండోటెస్టుకు దూరమయ్యారు. గాయాల కారణంగా వీరిద్దరు రెండోమ్యాచ్‌కు దూరమవుతున్నట్లు మేనేజ్ మెంట్ ప్రకటించింది.
ఇప్పటికే ఓపెనర్ పృథ్వీ షా గాయాల కారణంగా జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటంతో మేనేజ్‌మెంట్‌ని కలిచివేస్తోంది. అలాగే రోహిత్ స్థానంలో హనుమా విహారి తుదిజట్టులో చోటు దక్కడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే అశ్విన్ స్థానంలో రవీంద్రజడేజా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉండగా ఉమేష్,భువనేశ్వర్ కుమార్‌లు కూడా తుదిజట్టులో స్ధానం కోసం పోటీపడుతుండటంతో ఎవరికి ఫైనల్ బెర్త్ దక్కుతుందో అనేది సస్పెన్స్‌గా మారింది.
ఇప్పటికే ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్ డ్రాగా ముగియగా నాలుగుటెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ తొలిటెస్టులో ఘనవిజయం సాధించి 1-0తో లీడ్‌లో ఉంది.
భారతజట్టు:కోహ్లీ,మురళీవిజయ్,రాహుల్,పుజారా,రహానే,విహారి,పంత్,జడేజా,ఇషాంత్,షమీ,బుమ్రా,భువనేశ్వర్,ఉమేష్ యాదవ్