మహారాష్ట్రలో స్వయంఘోషిత జ్యోతిష్కుడు అశోక్ కరాత్ అలియాస్ “కెప్టెన్” కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పలువురు మహిళలపై లైంగిక దాడులు చేయడం, అలాగే మోసపూరిత ఆధ్యాత్మిక కార్యకలాపాల ద్వారా భారీగా డబ్బులు దోచుకున్నాడని ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో ఖరాత్ ప్రజలను ఎలా మోసం చేశాడో వెల్లడైంది. అతడు తనను శక్తివంతమైన ఆధ్యాత్మిక వైద్యుడిగా చూపించుకుని, నకిలీ పూజలు, మాయాజాలాలతో భక్తులను మభ్యపెట్టేవాడు. ముఖ్యంగా రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే నకిలీ పాములను ఉపయోగించి అవి కదులుతున్నట్లు చూపించి, అవి అద్భుత శక్తుల వల్ల జరుగుతున్నవిగా నమ్మించేవాడు.
అలాగే పులి చర్మాలు, అడవి జంతువులకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించి భయాన్ని సృష్టిస్తూ తన ప్రభావాన్ని పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఖరాత్ చౌకగా లభించే అడవి చింతపండు గింజలను పాలిష్ చేసి ఆధ్యాత్మిక శక్తి ఉన్న వస్తువులు గా చూపించి విక్రయించేవాడు. రూ.100 విలువ చేసే వాటిని రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు అమ్మి బాధితులను దోచుకున్నాడు. అలాగే నకిలీ రత్నాలు, రాళ్లను కూడా అద్భుత శక్తులున్నవిగా చెప్పి అమ్మినట్లు బయటపడింది.
ఈ కేసులో ఏక్‌నాథ్ షిండేఏ, రూపాలి చకంకర్,రాధాకృష్ణ పాటిల్ వంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసి నాసిక్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది.
Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!
ఈ కేసు 35 ఏళ్ల మహిళపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించినది. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పేరుతో 2022 నుంచి 2025 డిసెంబర్ వరకు ఆమెపై పలుమార్లు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపులు, మోసాలతో ఆమెను బలవంతంగా అణిచివేసినట్లు పోలీసులు తెలిపారు.
ఖరాత్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా, మార్చి 24 వరకు రిమాండ్ విధించారు.

