CSK హాల్ ఆఫ్ ఫేమ్‌గా రైనా

4
- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ తమ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తొలి సభ్యులుగా సురేష్ రైనా, మథ్యూ హెడెన్‌లను ప్రకటించింది. మార్చి 22న చెపాక్‌లో నిర్వహించిన ఫ్యాన్ ఈవెంట్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో జట్టు మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొని సందడి చేశారు.

సురేష్ రైనా ఇప్పటికీ సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆయన మొత్తం 5,529 పరుగులు సాధించారు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2021 వరకు సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన రైనా, జట్టుకు నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

అలాగే ధోని గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సీఎస్‌కే ఛాంపియన్ లీగ్ టీ20లో 2010, 2014 సంవత్సరాల్లో విజయం సాధించడంలో కూడా రైనా ముఖ్య పాత్ర పోషించాడు. 2014లో ఆయన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.

మ్యాథ్యూ హేడెన్ సీఎస్‌కే తొలి మూడు సీజన్లలో (2008-2010) జట్టులో భాగమయ్యాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఐపీఎల్‌లో రాణించి అదే ఏడాది ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2010లో సీఎస్‌కే తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో హేడెన్ కీలక పాత్ర పోషించాడు.

Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!

- Advertisement -