జోడో యాత్ర కలిపింది వారిద్దరిని!

223
rajasthan congress
- Advertisement -

అవును ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వారిద్దరిని కలిపింది. సొంతపార్టీలోనే ఉప్పు – నిప్పుగా ఉన్న వారిద్దరూ కలిశారు. ఇంతకీ వారేవరూ అనుకుంటున్నారా…?ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మరొకరు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్.

ఒకేపార్టీలో ఉన్న నిన్నటివరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. అయితే త్వరలో భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించనున్న నేపథ్యంలో యాత్ర కో ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన భేటీలో వీరిద్దరూ కలిశారు. భేటీ అనంతరం చేతులు కలిపి పైకి ఎత్తుతూ ఐక్యతా చిహ్నాం చూపిస్తూ అభివాదం చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో విస్తుపోవడం అందరి వంతైంది.

భేటీ అనంతరం సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ…మా ఇద్దరి మధ్య ఎన్నున్నా.. మాకు సుప్రీం పార్టీనే. పార్టీ ప్రయోజనాల ముందు మా వివాదాలు చాలా చిన్నవి అని చెప్పుకొచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీలో ఒక కొత్త మెరుపును తీసుకురావాలనే మేము అనుకున్నాం. అదే మా ఈ ఐక్యత అని తెలిపారు. ఇక సచిన్ పైలట్ సైతం రాహుల్ గాంధీని అత్యంత ఉత్సాహంతో అత్యంత బలంతో స్వాగతం పలకుతాం అని తెలిపారు.రాహుల్ కి స్వాగతం చెప్పేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారన్నారు. 12 రోజులు రాష్ట్రంలో పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. మరి యాత్ర కోసం కలిసిన ఈ ఇద్దరు నేతలు 12 రోజుల తర్వాత తిరిగి విమర్శలు గుప్పించుకుంటారా? లేదా నిజంగానే కలిసిపోయారా అన్నది తేలనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -