ప్రభాస్‌తో లవ్‌.. క్లారిటీ ఇచ్చిన కృతి!

94
- Advertisement -

ప్రభాస్ – కృతి సనన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్‌. ఈ సినిమా రిలీజ్ గురించి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ – కృతి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. దీంతో రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరూ ఒకటి కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది..

ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు కృతి. వరుణ్ ధావన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలా మాట్లాడాడని.. తాను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనని తెలిపింది. కేవలం జాలీగా మాట్లాడే ఉద్దేశ్యంతోనే వరుణ్ అలాంటి కామెంట్స్ చేశాడని కృతి చెప్పుకొచ్చింది. దీంతో కృతి సనన్ ప్రేమకు సంబంధించి వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -