- Advertisement -
నిన్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు ఎయిర్ ఇండియా సిబ్బంది షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఎయిర్ ఇండియా-451 విమానంలో ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరారు. ఈ సందర్భంగా 9 బ్యాగులను లగేజీలో బుక్ చేశారు. అనంతరం ఆయన విశాఖ చేరుకున్నాక లగేజీలో ఒక బ్యాగ్ మిస్సైంది. ఈ విషయాన్నిఆయన ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై ఆరా తీసిన యాజమాన్యం సిబ్బంది నిర్వాకం వల్లే పొరపాటు జరిగిందని అశోక్ గజపతి రాజుని క్షమాపణ కోరింది. లగేజీని జాగ్రత్తగా పంపిస్తామని హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఎయిర్ ఇండియా నిర్వాకంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ విమానయాన శాఖ మంత్రికే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
- Advertisement -