సింహాచలం ఆలయ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు

59
gajapathi raju
- Advertisement -

సింహాచల ఆలయ ఛైర్మన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. అశోక గజపతిరాజునే ఆలయ ఛైర్మన్‌గా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. అశోక్ గజపతిరాజును చైర్మన్ గా మరో 14 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండేళ్ల కాల పరిమితితో నూతన పాలకవర్గం ఏర్పాటు కానుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింహాచలం ఆలయానికి చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించింది. 2020 మార్చి 3న సింహాచల ఆలయ ఛైర్‌పర్సన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజుతో పాటు, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

చైర్ పర్సన్ గా సంచయిత బాధ్యతలు చేపట్టింది. అయితే తనను చైర్మన్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా గజపతిరాజుకు అనుకూలంగా తీర్పువచ్చింది.

- Advertisement -