ఆశా వర్కర్లు,పారిశుధ్య కార్మికుల జీతాలు పెంపు..

142
ASHA4
- Advertisement -

సీఎం కేసీఆర్‌ మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. ఆశా వర్కర్లు,శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లు,పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు తార్కాణం అన్నారు కేటీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో ఇబ్బందులు పడ్డ ఆశా వర్కర్లు, శానిటేషన్, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు మరే రాష్ట్రంలో లేనట్టుగా మూడు సార్లు జీతాల పెంచారని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆశా వర్కర్లకు గౌరవ వేతనంగా రూ.1800 మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అది అంచెలంచెలుగా పెంచి రూ.9,750కు టీఆర్ఎస్ ప్రభుత్వం చేర్చిందన్నారు. నిత్యం ప్రజారోగ్య రక్షణ విధులు నిర్వర్తించే ఆ ఉద్యోగులకు ఇది సముచిత గౌరవం! అన్ని వర్గాల సంక్షేమం పట్ల TRS ప్రభుత్వా నిబద్ధతకు నిదర్శనం అన్నారు.

22,533 మంది పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లు, 7,271 మంది పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

- Advertisement -