తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు ఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రగతి భవన్లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే సాధారణ వ్యక్తిలా ఒక్కడే బుల్లెట్ బైక్‌పై ప్రగతి భవన్‌కు వచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు. అసద్ బైక్‌కు సంబంధించిన ఫోటోలు,వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
మరోవైపు సీఎం కేసీఆర్‌ను కలవడానికి ముందే ట్వీట్టర్లో ట్వీట్ చేసిన అసద్…టీఆర్ఎస్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ పూర్తి స్ధాయి మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఎంఐఎం..టీఆర్ఎస్కు సపోర్టు ఇస్తుందన్నారు. జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగని తెలిపారు. అసద్-కేసీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
#WATCH Hyderabad: AIMIM Chief Asaduddin Owaisi arrives at the CM residence to meet caretaker Telangana Chief Minister K Chandrasekhar Rao. pic.twitter.com/HSnOyX4NAs
— ANI (@ANI) December 10, 2018