ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారిన ఓవైసీ..

243
owaisi

హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ ‘ట్రాఫిక్‌ కానిస్టేబుల్’గా మారారు.. శనివారం సాయంత్రం పాతబస్తీలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. పాతబస్తీ మీదుగా ఎంపీ వెళ్తుండగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఆ సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరూ లేకపోవడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అడ్డదిడ్డంగా వెళ్తున్నా వాహనాలను ఒవైసీ స్వయంగా దారి మళ్లించారు. ట్రాఫిక్ నియంత్రించిన కొద్దిసేపటికి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.