మనం ట్వీన్స్ పిల్లలను చూశాము. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలను చూశాము. కానీ అరుదైన కేసుల్లో మాత్రమే ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మనివ్వడం మాత్రము చూడాలంటే మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లాల్సిందే. అవును నిజం…రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్యకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. పొద్దులు నిండిన లావణ్యను ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు కోసం కోసం చేరిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
ముస్తాబాద్ ఆసుపత్రిలోని పీపుల్స్ ఆస్పత్రిలో చేరిన లావణ్య రెండో కాన్పులో మొత్తంగా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. మొదటి సంతానంలో బాబు…అతనికి 9యేళ్లు ఉన్నాయి. రెండో కాన్పుల్లో తొలుత బాబు రెండవసారి పాప, అనంతరం మరో ఇద్దరు బాబులకు జన్మనిచ్చింది. తల్లి,నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.
ఒకే కాన్పుల్లో నలుగురు ప్రసవించడం చాలా అరుదైన సంఘటనగా డాక్టర్లు పేర్కొన్నారు. శిశువులు 1 కిలోగ్రాము చొప్పున బరువు ఉన్నారని వెల్లడించారు. వీరిని ఇంక్యూబేటర్‌లో పరిశీలిన నిమిత్తం సిద్దిపేటలోని చిల్ర్డన్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి…