BB6..అర్జున్ కళ్యాణ్‌ ఎలిమినేట్

435
Arjun Kalyan
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఏడోవారం నామినేషన్స్‌లో 13 మంది నిలవగా వీరిలో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యారు. పోతుపోతు రేవంత్‌పై బాంబు పేల్చివెళ్లారు అర్జున్. హౌస్‌లో ఎవరు ఆటం బాంబ్, ఎవరు తుస్ బాంబ్ చెప్పాలని నాగ్ కోరగా ఒక్కొక్కరి ఫోటో వద్ద ఆటం బాంబ్, తుస్ బాంబ్‌ పెట్టారు. రేవంత్ ఆటం బాంబు కాదని .. హైడ్రోజన్ బాంబు అన్నారు.

సన్‌డే ఫన్‌డేలో భాగంగా హీరో కార్తి, హైపర్ ఆది, హీరోయిన్ అంజలి, సింగర్ శ్రీరామచంద్ర కూడా అతిథులుగా హాజరై హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించారు. అవికా గోర్, యాంకర్ రష్మి డాన్సులతో అదరగొట్టారు.

ఇక అర్జున్ ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున ప్రకటించగానే.. హౌస్‌లో అందరికన్నా సత్య ఎక్కువ ఫీలయ్యింది. కన్నీరు పెట్టుకుంది. శ్రీహాన్, రేవంత్ కూడా ఎమోషనల్ అయ్యారు. సత్య కంటతడి పెట్టుకోవడంతో ఆమెను చూసి అర్జున్ కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయిపోయారు.

ఇక షో నుంచి వెళ్లిపోతూ అర్జున్ ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. తాను బిగ్ బాస్‌ షోకు రావడానికి ప్రధాన కారణం సత్య అని చెప్పాడు. ఒక సినిమా అవకాశం ఉందని తాను సత్యకు చెప్తే.. నేను చేయను బిగ్ బాస్‌కు వెళ్తున్నానని చెప్పిందని.. దీంతో తాను కూడా బిగ్ బాస్‌కు అప్లయ్ చేశానని చెప్పాడు.

- Advertisement -