విజయ్‌కు బంపర్ ఆఫర్!

355
- Advertisement -

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్‌గా లైగర్ ఫ్లాప్‌ని మూటగట్టుకున్న విజయ్‌కి దుబాయ్ ప్రభుత్వం నుండి బంపర్ ఆఫర్ వచ్చింది.

లైగర్‌లో బాక్సర్‌గా కనిపించారు విజయ్‌. MMA ఛాంపియన్ షిప్ కి ట్రైనింగ్ అయ్యే బాక్సర్ గా కనిపించగా తాజాగా దుబాయ్‌లో నిర్వహించే “MMA ఛాంపియన్ షిప్” బాక్సింగ్ పోటీలకు అక్కడి ప్రభుత్వం విజయ్ ను అతిధిగా ఆహ్వానించింది. దీంతో విజయ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ప్రస్తుతం విజయ్‌…శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం చేస్తున్నారు. విజయ్ కి జోడిగా సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -