గ్రహాంతర వాసులపై ఎన్నో ఊహాగానాలున్నాయి. భూమీ లాగానే ఈ అనంత విశ్వంలో కూడా ఎక్కడో ఒక గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకంటే తెలివైన వారని, వారే గ్రహాంతర వాసులని అంటుంటారు.
అప్పుడప్పుడూ.. భూమి మీదకు వస్తుంటారని కొంత మంది శాస్త్రవేత్తల నమ్మకం. అయితే…నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారా? నిజంగా ఎవరైనా ఏలియన్ ను చూసినవారు ఉన్నారా? అనే ప్రశ్నకి ‘నేటి విజ్ఙాన శాస్త్రం’ వద్ద కచ్చితమైన ఆధాలేవీ లేవనే చెప్పాలి. అయితే.. ఎంతో మందిని సంధిగ్థంలో పడేసే ఈ గ్రహాంతర వాసుల థీమ్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి.
ఇదిలాఉంటే.. తాజాగా ఏలియన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1947లో అమెరికా, మెక్సికోలోని రోస్ వెల్ ప్రాంతానికి సమీపంలోని 51 అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా బలగాలు చెప్పాయి.
అయితే, కొందరు మాత్రం ప్లైయింగ్ సాసర్ పేలిపోయిందని, అది ఏలియన్ ల అంతరిక్ష నౌక అని తెలిపారు. మరోవైపు రష్యా అణుబాంబు పరీక్ష వివరాలు తెలుసుకునేందుకు సీక్రెట్ గా ఏర్పాటు చేసిన ప్రయోగంలో ఆ బెలూన్ పేలిపోయిందని మరికొన్ని కథనాలు వెలువడ్డాయి.
కానీ.. కథనాలు సంగతి ఎలా ఉన్నా, అప్పటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడు సందర్భంగా అక్కడికి చేరుకున్న యూఎస్ బలగాలు స్ట్రెచర్ పై ఏలియన్ ను స్వయంగా తరలించడం ఆ వీడియోలో కనిపిస్తుంది. స్పేస్ షిప్ పేలిపోవడంతో ఏలియన్ గాయపడిందని, దానిని స్వయంగా సైనికులు స్ట్రెచర్ పై తరలించారని వీడియో చూసిన వారికి అర్ధమవుతుంది. ఇప్పుడీ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=Ztxvr5xXBmQ