హ్యాపీ బర్త్ డే… ఆలీ

341
Happy birthday Ali
- Advertisement -

బాల నటుడిగా సినీప్రస్థానం ప్రారంభించి టాలీవుడ్‌ అగ్ర హాస్యనటుల్లో ఒకరిగా కెరీర్‌ని మలుచుకున్న నటుడు ఆలీ. నిరుపేద కుటుంబంలో పుట్టిన అలీ అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్‌లో అగ్రస్ధాయి నటుడిగా ఎదిగారు. ఆలీ సినిమాలో కనిపిస్తే ప్రేక్షకుల ముఖంలో నవ్వుల పువ్వులు పూయాల్సిందే. హాస్యనటుడిగా మిమిక్రీ చేసినా..థాయ్‌ మసాజ్‌ చేసినా అది ఆలీకే సెట్‌ అవుతుంది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

భారతీ రాజా దర్శకత్వంలో 1981లో వచ్చిన  సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ ఇంతింతై వటుడింతై అన్నట్టు దాదాపు వేయి చిత్రాల్లో నటించాడు. కామెడి పాత్రలు చేస్తూ హీరోగా తన నటనతో లక్షలాది అభిమానులని సంపాదించుకున్నాడు.

Happy birthday Ali
‘చాట’ మార్కు డైలాగులు, నాలుక బయటపెట్టి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, తనదైన శైలీలో డైలాగులు చెప్పే పద్దతి, ఆ టైమింగ్, నిజంగా అద్భుతం. వేయి సినిమాలు చేయడం మాటలు కాదు. ఆలీ హీరోగా చేసిన చివరి చిత్రం “ఆలిబాబా ఒకడే దొంగ”.

ఓ వైపు సినిమా రంగంలో బిజీగా ఉన్న ఆలీ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పేద కళాకారులను ఆదుకోవడంతో పాటు  గాంధీ జయంతి సందర్భంగా చంచల్‌గూడా జైలులో నలుగురు మహిళా ఖైదీల కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.

Happy birthday Ali

ఏ సినిమాలోనైనా సరే ఆలీ తన సొంత శైలిలో డైలాగులు చెప్పడంలో కొత్తదనాన్ని, కొత్త నవ్వుల కోణాన్ని ఆవిష్కరిస్తారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో అలీ కనిపించకుండా ఉండరు. పూరీ జగన్నాథ్‌ తీసే దాదాపు ప్రతీ సినిమాలో ఆలీ ఉండాల్సిందే. ఆలీ ఎక్కడ ఉన్నా ఆపన్నులకు తన సేవా హస్తం అందిస్తుంటారు.తన కెరీర్‌లో ప్రేక్షకులను మెప్పించే మరిన్ని పాత్రలు చేయాలని కోరుకుంటూ వెండితెర నవ్వుల రారాజుకు greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -