ఒక్కటైన ఆర్చర్లు దీపిక-అతాను

160
archers
- Advertisement -

సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న భారత ఆర్చర్లు దీపిక కుమారి- అతాను దాస్ ఒక్కటయ్యారు. మంగళవారం జార్ఖండ్‌లోని రాంచీలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం హేమంత్ సోరెన్‌ హాజరై వధువరులను ఆశీర్వదించారు.

రెండే సంవత్సరాల క్రితమే వీరి ఎంగేజ్ మెంట్ జరుగగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు వీరిద్దరు. ఈ టోర్ని తర్వాత పెళ్లిచేసుకోవాలనుకోగా కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో అతిథుల్ని పిలవడమే కాకుండా.. వారికి మాస్కులు, శానిటైజర్లని కూడా వివాహ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఈ జంట.. రెండు దఫాలుగా అతిథుల్నిఅక్కడికి వచ్చేలా షెడ్యూల్ చేసింది. కేవలం 50 మంది మాత్రమే వీరి పెళ్లికి హాజరుకాగా తోటి అర్చర్లకు ఆహ్వానం అందించలేదు ఈ జంట.

- Advertisement -