రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రికి గాయాలు..

31
damodhar reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా సుజాత నగర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీ కొట్టింది. దీంతో దామోదర్ రెడ్డి వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టగా ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉంది.

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు రాంరెడ్డి దామోదర్ రెడ్డి. తుంగతుర్తి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు.