Germany:కాంస్యయుగం నాటి ఖడ్గం లభ్యం

38
- Advertisement -

జర్మనీలో మూడువేల సంవత్సరాల నాటి పురాతన ఖడ్గాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కాంస్యయుగానికి చెంఇన ఓ ఖడ్గమని నిర్దారించారు. అయితే ఈ ఖడ్గం ఏమాత్రం పాడవకుండా మెరుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జర్మనీలోని బవేరియన్‌ స్టేట్‌ ఆఫీస్‌ ఫర్ మోనుమెంట్‌ ప్రొటెక్షన్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..బవేరియన్ పట్టణంలోని నార్డ్‌ లింజెన్‌లో జరిపిన తవ్వకాల్లో ఓ మహిళ, పురుషుడు, చిన్నారి సమాధిలో ఈ ఖడ్గం కనిపించింది. ముగ్గురిని ఒకరి తర్వాత మరొకరిని ఖననం చేశారని, వారి మధ్య సంబంధం ఏంటనేది విషయాలు తెలియరాలేదని పేర్కొంది. వీరిని ఒకరి తర్వాత ఒకరిని ఖననం చేశారా…లేదా ఓకేసారి ఖననం చేశారా అనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: KTR:సుపరిపాలన కోసమే వార్డు కార్యాలయం

ఈ ఖడ్గం కాంస్య యుగానికి చెందిన అష్టభుజి కత్తి రకమని శాస్త్రవేత్తలు ప్రాథమిక నిర్ధారణ చేశారు. అయితే ఇందులో పిడిని మాత్రం అష్టభూజి ఆకారంలో తయారుచేసినట్టు చెప్పారు. ఇది 14వ శతాబ్ధానికి చెందినదని,అ కాలం నాటివి ఈప్రాంతంలో విరివిగా లభ్యమవుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే మధ్య కాంస్య యుగం నాటి సమాధులు శతాబ్ధాలుగా దోపిడికి గురైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Also Read: ఆ ఇద్దరి విషయంలో వీడని సస్పెన్స్?

- Advertisement -