ఘనంగా సినీనటి అర్చనా వివాహం..

749
archana
- Advertisement -

సినీ నటి అర్చన వివాహం ఘనంగా జరిగింది. గచ్చిబౌలిలోని కొల్ల మాధవరెడ్డి గార్డెన్‌లో హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో ఘ‌నంగా జ‌రిగింది. తెల్లవారుజామున 1:30 ని.ల‌కి మూడుముళ్ల బంధంతో అర్చన,జగదీశ్‌లు ఒక్క‌టిటయ్యారు.

ఈ వివాహవేడకకు కొంతమంది సినీప్రముఖులు హాజరయ్యారు. ఇక పెళ్ళికి కొద్దిగంటల ముందు రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

2004లో ‘తపన’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అర్చ‌న‌. ఆ త‌రువాత ప‌లు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల‌లో న‌టించింది. నేను సినిమా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించి మెప్పించారు అర్చ‌న‌. అర్చన చివరి సినిమా ‘వజ్ర కవచధర గోవింద’.

- Advertisement -