సంగీత్‌లో ఆడిపాడిన జంట నటి అర్చన..

704
Archana sangeeth function

న‌టి అర్చ‌న వేద ఇంట పెళ్లి సందడి మొదలైంది. అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్‌తో అర్చ‌న నిశ్చితార్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నవంబర్ 13 తెల్ల‌వారుజామున 1.30ని.ల‌కి హైదరాబాద్‌లో వీరి వివాహం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి జరగనున్న గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

Archana

ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా వారితో కాలు కదిపారు. కాగా, నేడు రిసెప్షన్ జరగనుంది. సంగీత్ కార్యక్రమానికి వధూవరుల తల్లిదండ్రులతోపాటు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.

2004లో ‘తపన’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అర్చ‌న‌. ఆ త‌రువాత ప‌లు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల‌లో న‌టించింది. నేను సినిమా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించి మెప్పించారు అర్చ‌న‌.