యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో ఈసినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ కుర్రాడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇక ఈమూవీ షూటింగ్ సగం వరకూ పూర్తయింది. ఎన్టీఆర్ కు జోడిగా పూజా హెగ్డె, ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటింస్తోన్నారు. ఈమూవీకి సంగీతం తమన్ అందిస్తోన్నాడు. భారీ బడ్జెట్ తో చినబాబు మూవీని నిర్మిస్తోన్నారు.
తాజాగా ఈసినిమా విడుదలపై ఓ క్లారిటికి వచ్చారు చిత్రబృందం. దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేస్తామని మొదటినుంచి చెప్పుకుంటువస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10వ తేదిన ఈసినిమాన విడుదల చేయాలనే ప్రయత్నాలు చేస్తోన్నారు దర్శక నిర్మాతలు. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో గురువారం లేక శుక్రవారం సినిమాలు చేస్తుంటారు కానీ అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని బుధవారం రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కు కొంచెం గ్యాప్ తీసకున్నాడు. అతనికి మరో బాబు జన్మనివ్వడంతో ఫ్యామిలితో గడుపుతున్నాడు. మరో వారం రోజుల్లో ఎన్టీఆర్ షూటింగ్ కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ షూటింగ్ కు హాజరయ్యాక పూర్తి వివరాలు తెలియనున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మొత్తానికి ఎన్టీఆర్ దసరాకు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.