21న సీతారామ కల్యాణ మహోత్సవం..

145
Bhadrachalam
- Advertisement -

భద్రాచలం తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 13 నుంచి 27వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. కరోనా నేపథ్యంలో జాగ్రత్తల మధ్య బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 17న మృత్స్యంగ్ర‌హ‌ణం, వాసు హోమం, అంకురారోప‌ణంతో ప్రారంభ‌మై 18న గ‌రుఢ‌ప‌ట లేఖ‌నం, 19న ధ్వ‌జారోహ‌ణం, 20న ఎదుర్కోలు జరగనుంది.

21న సీతారామ‌క‌ల్యాణ మ‌హోత్స‌వం, 22న శ్రీరామ మ‌హాప‌ట్టాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు. 23న స‌ద‌స్యం, 24న తెప్పోత్స‌వం, చోరోత్స‌వం, 25న ఊంజ‌ల్ సేవ‌, 26న వ‌సంతోత్స‌వం, 27న చ‌క్ర‌తీర్థ‌, పూర్ణాహుతి, ద్వాద‌శ ప్ర‌ద‌క్ష‌ణ‌లు, ధ్వ‌జావ‌రోహ‌ణం, ద్వాద‌శ ఆరాధ‌న‌లు, శేష వాహ‌న సేవ‌, శ్రీపుష్ప‌యాగంతో ఉత్స‌వ స‌మాప్తి కానుంది.

- Advertisement -