భాషతో సంబంధం లేకుండా బ్లాక్‌బస్టర్లు అందుకుంటున్నారు మోహన్‌లాల్. వరుసగా హిట్టు మీద హిట్టు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఆయన నుంచి మరో చక్కని ఎంటర్‌టైనర్ రాబోతోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే చిత్రమిది. లాల్ నటించిన మలయాళ సూపర్‌హిట్ `రన్ బేబి రన్` తెలుగులోకి `బ్లాక్‌మనీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో అనువాదమై రిలీజవుతోంది.
నిజామ్ సమర్పణలో మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే సెన్సార్ బృందం `క్లీన్ యు` సర్టిఫికెట్ ఇచ్చి అభినందించిన సంగతి తెలిసిందే. ఈనెల 21న తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -“మోహన్‌లాల్ తెలుగులో వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఈ జోరు ఇక మీదటా కొనసాగుతోంది. అసలు లాల్ సినిమా వస్తోంది అంటేనే తెలుగునాట ఒకటే క్యూరియాసిటీ కనిపిస్తోంది. అందుకే మీడియా నేపథ్యంలో తెరకెక్కిన `బ్లాక్‌మనీ` పెద్ద విజయం సాధిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో వస్తోంది.
ఈ చిత్రంలో లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా నటించారు. కథానాయిక అమలాపాల్ సీనియర్ ఎడిటర్ రేణుక పాత్రలో నటించారు. సంబంధ బాంధవ్యాలు, వృత్తిపరమైన సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులోనూ అంతే పెద్ద విజయం అందుకుంటుందని ఆశిస్తున్నాం. తెలుగు వెర్షన్ అనువాదం సహా సెన్సార్ పూర్తయింది. ఈనెల 21న తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.