ఏప్రిల్‌ 21న ‘ఇద్దరి మధ్య 18’

115
Iddari Madhya 18 Release On Apirl 21st

ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావు గారు, మరియు సెన్సార్‌ సభ్యుల అభినందనలను అందుకున్న ఈ చిత్రం ఏప్రియల్‌ 21న విడుదలకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Iddari Madhya 18 Release On Apirl 21st
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..”ఇద్దరి మధ్య 18” చిత్రం మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ. చిత్రం అంతా అద్భుతంగా వచ్చింది. ఇటీవలె సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ సభ్యులు ఈ సినిమాపై ప్రత్యేక అభినందనలు తెలుపడంతో పాటు, తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారు సినిమా చూసి..మంచి మెసేజ్‌ ఇస్తున్నారని మమ్మల్ని అభినందించడం ఎంతగానో ఆనందాన్నిచ్చింది.

దర్శకుడు నాని ఆచార్య సినిమాని తెరకెక్కించిన విధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏప్రియల్‌ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..” అని అన్నారు.
 Iddari Madhya 18 Release On Apirl 21st
రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కెమెరా: జి.ఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదిగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి.భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ-డైరెక్షన్‌: నాని ఆచార్య.