గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తా: బుర్రా శ్రీనివాస్

6
- Advertisement -

గిరిజ‌నుల అభ్యున్న‌తి కోసం వారి గొంతునై ప‌లికేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న‌కు గిరిజన ఆర్ధికాభివృద్ది కార్పోరేష‌న్ చైర్మ‌న్ ఇచ్చార‌ని పోల‌వ‌రం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ బుర్రా శ్రీనివాస్ అన్నారు.

పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అవిర్భావించిన త‌ర్వాత ఇంత‌టి గౌర‌వం ఎవ‌రికి దక్క‌లేద‌ని, రాష్ట్రంలో గిరిజ‌నుల అభివృద్ది కోసం నిర్విరామంగా ప‌నిచేయాల‌ని ఆదేశంతో త‌ను ఈ ప‌ద‌వి ఇచ్చార‌ని శ్రీనివాస్ అన్నారు.

గిరిజ‌న యూనివ‌ర్శిటీ విస్త‌రణ‌తో పాటు కేంద్రాన్ని స‌మ‌న్వ‌యం చేసుకొని గిరిజ‌నుల‌ను విద్యా. వైద్య‌. ఆర్థికాభివృద్ది వైపు నడిపిస్తానని ఏపీ ట్రై కార్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ వెల్లడించారు.

Also Read:విటమిన్ లోపం.. తప్పక తెలుసుకోండి!

- Advertisement -