ఏపీ రాజధాని విశాఖనే.. క్లియర్!

34
jagan
- Advertisement -

ఏపీ రాజధాని పై గత కొన్ని రోజులుగా హాట్ హాట్ చర్చలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని కాదని జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తీసుకొచ్చింది. అంతే కాకుండా మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు.. అయితే అమరావతి రాజధాని కొరకు భూములిచ్చిన రైతుల నుంచి త్రీ క్యాపిటల్స్ పై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో హైకోర్టు కూడా మూడు రాజధానుల అమలు పై ఆంక్షలు విధించింది. దీంతో ఈ త్రీ క్యాపిటల్స్ విషయంలో జగన్ సర్కార్ వెనక్కు తగ్గబోతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి.

కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గే ఆలోచనే లేదని మూడు రాజధానులను అమలు చేసి తీరుతామని చెబుతోంది. ఇదిలా ఉంచితే రాజధాని మార్పుపై ఇప్పటివరకు పెద్దగా స్పందించని సి‌ఎం జగన్.. తాజాగా స్పందించారు. త్వరలో ఏపీ విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని తాను కూడా అక్కడికె షిఫ్ట్ కాబోతున్నట్లు సి‌ఎం జగన్ స్పష్టం చేశారు. డిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో మాట్లాడుతూ పై విధంగా చెప్పుకొచ్చారు సి‌ఎం జగన్. దీంతో ఏపీ రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అయితే కేవలం విశాఖను మాత్రమే రాజధానిగా చేస్తారా.. లేదా మొదటి నుంచి చెబుతున్నట్లుగా విశాఖాతో పాటు కర్నూల్, అమరావతి ని కూడా రాజధానులుగా ప్రకటిస్తారా అనేది చూడాలి. అయితే పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న దాని ప్రకారం మొదటి విశాఖను రాజధానిగా ప్రకటించి ఆ తరువాత మెల్లగా న్యాయ రాజధానిగా కర్నూల్, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్రీ క్యాపిటల్స్ విషయంలో కోర్టు నుంచి స్టే ఉన్నందున ఒకే సారి మూడు కాకుండా ఒకదాని తరువాత మరొకటి అన్నా రీతిలో జగన్ సర్కార్ ప్రణాళికలు వెస్తోన్నట్లు తెలుస్తోంది. మరి విశాఖ రాజధాని ప్రకటనపై అటు ప్రజల నుంచి.. ఇటు విపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు..

మరోసారి బీజేపీకి కేటీఆర్‌ సవాల్‌…

ఆజన్మాంతం వారిద్దరికి రుణపడ్డాను…

- Advertisement -