ఏపీలో ఫ్యామిలీ డాక్టర్లు.. !

62
- Advertisement -

ఏపీలో జగన్ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అభివృద్ది పథంలో దూసుకుపోతోంది. అధికారం చేపట్టిన మూడు సంవత్సరాలలోనే ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చామని చెప్పుకుటోంది వైసీపీ సర్కార్. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఉచిత పథకాలపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి వైఎస్ జగన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా మరెన్నో సరికొత్త పథకాలకు శ్రీకారం చూడుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఎక్కడ లేని విధంగా వాలెంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వంటివి ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేశారు సి‌ఎం జగన్.

వాలెంటరీ వ్యవస్థలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలెంటరీని నియమించి ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలు పొందే విధంగా చూస్తున్న జగన్ సర్కార్.. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతుంది. మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యంగా వాలెంటరీ వ్యవస్థ మాదిరి గానే ఫ్యామిలీ డాక్టర్స్ విధానాన్ని ప్రవేశ పెట్టబోతుంది జగన్ సర్కార్. ఈ విధానం ద్వారా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇళ్లకే వెళ్ళి వైద్య సేవలు అందించే వెసులుబాటు ఉంటుంది. ఈ విలేజ్ డాక్టర్స్ కాన్సెప్ట్ లో విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేసి వాటి ద్వారా 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటోంది జగన్ సర్కార్.

ఈ క్లినిక్ లకు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గా నామకరణం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పది వేలకు పైగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేసి ఒక్కో క్లినిక్ ద్వారా 2 వేల మందికి వైద్య సేవలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ విలేజ్ క్లినిక్ లకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి కాగా ఈ ఏడాది మార్చి 1 నుంచి ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు సి‌ఎం జగన్ తాజాగా స్పష్టం చేశారు. మరీ ఇప్పటికే ఎన్నో సరికొత్త విధానాలకు జీజం వేసిన జగన్ సర్కార్.. ఈ ఫ్యామిలీ డాక్టర్స్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానుండడంతో దీనిపై సర్వత్ర ప్రశంశలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

తారకరత్నకు తీవ్ర అస్వస్థత

మీలో ఎవరు సి‌ఎం అభ్యర్థి?

29న బీఆర్ఎస్‌పీపీ సమావేశం..

- Advertisement -