AP:ఏపీలో బి‌ఆర్‌ఎస్ టార్గెట్ 175.. ఆ పార్టీలకు ముప్పే

49
- Advertisement -

ఏపీలో బి‌ఆర్‌ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలం పెంచుకుంటుంది. ఇతర పార్టీల నేతలు బి‌ఆర్‌ఎస్ వైపు చూస్తుండడం అలాగే ఏపీ ప్రజల దృష్టి కూడా బి‌ఆర్‌ఎస్ పై పడుతుండడంతో అక్కడ బి‌ఆర్‌ఎస్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక ఏపీలో ఎన్నికలకు పట్టుమని ఏడాది సమయం ఉండడంతో ఈసారి ఏపీ ఎన్నికల్లో సత్తా చాటలని బి‌ఆర్‌ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను కేంద్రం మొదలు వంచి సాధించుకోవడంలో ప్రధాన పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి పార్టీలు కేంద్రంతో పోరాడడంలో వెనుకడుగు వేస్తున్నాయి. అలాగే ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపడంలో కూడా ఈ రెండు పార్టీలు మౌనం వహిస్తున్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే కేంద్రం వద్ద జగన్, చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చునే పరిస్థితే తప్పా కేంద్రం మెడలు వంచి సాధించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మోడి సర్కార్ అనుసరిస్తున్న దుశ్చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా మోడి సర్కార్ వ్యతిరేక శక్తుల నుంచి కే‌సి‌ఆర్ కు భారీగా మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో మోడి ఢీ కొట్టి నిలబడడం ఒక్క కే‌సి‌ఆర్ వల్లే సాధ్యం అనే భావనా ఏపీ ప్రజల్లో కూడా ఉంది. అందుకే ఏపీలో బి‌ఆర్‌ఎస్ వేగంగా బలపడుతూ ప్రధాన పార్టీ హోదా కూడా దగ్గరవుతోంది. ఇక విశాఖా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ఇటీవల కేంద్రం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రానికి కే‌టి‌ఆర్ రాసిన భాహిరంగ లేఖకు ఏపీ నేతల నుంచి కూడా మంచి సానుకూలత వచ్చింది.

ఇవన్నీ బేరీజు వేస్తే ఇతర పార్టీల అసంతృప్త నేతలు బి‌ఆర్‌ఎస్ లో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో బి‌ఆర్‌ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు తోట చంద్రశేఖర్.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు పోటీచేస్తుందని స్పష్టం ఛెశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. వైసీపీ మినహా టిడిపి, జనసేన పార్టీలు పోటీ చేసే స్థానాలను ఇంతవరకు స్పష్టం చేయలేదు. కానీ బి‌ఆర్‌ఎస్ మాత్రం టార్గెట్ 175 అనడంతో ఏపీలోని ప్రధాన పార్టీలలో అలజడి రేగిందనే చెప్పాలి. మరి 175 స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పోటీ చేస్తే ఏపీ రాజకీయలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి టర్న్ తీసుకొనున్నాయో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పెండింగ్ బిల్లులపై సుప్రీంలో విచారణ

BRS:పొంగులేటి,జూపల్లి సస్పెండ్

దేశంలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

- Advertisement -