- Advertisement -
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయింది. ఎన్నికల కమిషన్ సూచించిన షెడ్యూల్ ప్రకారమే మున్సిపోల్స్ జరుగుతాయని ఏపీ హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు జరగనుండగా షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా అదేరోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది.
- Advertisement -