మూడో రోజు స్థిరంగా చమురు ధరలు..

106
Petrol Price

పెరుగుతున్న పెట్రోల్ ధరలు వరుసగా మూడో రోజు స్థిరంగా ఉన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచాయి చమురు కంపెనీలు. రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి 101 రూపాయల 59 పైసలుగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయలుగా ఉండగా ముంబైలో 97 రూపాయలుగా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 34 పైసలుగా ఉండగా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 54 పైసలు, డీజిల్ 88 రూపాయల 69 పైసలుగా ఉన్నాయి.