టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన యాప్. ఈ టిక్ టాక్ ద్వారా చాలా మంది రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయ్యారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వారకు ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈ యాప్ వల్ల తమ ఉద్యోగాలను కూడా పొగొట్టుకున్నారు. ఇక తాజాగా ఓ డిప్యూటీ సీఎం టిక్ టాక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియోలో హల్ చల్ చేశారు. సీఎం జగన్‌ను పొగుడుతూ ఉన్న ఓ పాటను అనుకరిస్తూ ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అనే పాటతో ఆమె టిక్ టాక్ వీడియో చేశారు. . ఓ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి టిక్ టాక్‌లో ఇలా చేయడం గురించి సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఈమె టిక్ టాక్ వీడియోకు పలువురు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జగన్ డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. ఏది ఎమైనా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ చేయడం చూశాం కానీ మొదటిసారిగా ఓ ఎమ్మెల్యే అందులో డిప్యూటీ సీఎం టిక్ టాక్ చేయడం చర్చాంశనీయంగా మారింది.