ఏపీలో లక్షదాటిన కరోనా కేసులు…

319
ap corona cases
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు వేల సంఖ్యలో నమోదవుతునే ఉన్నాయి. ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 6,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 1090 మంది మృత్యువాతపడ్డారు.

ఇక ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కు చేరగా ప్రస్తుతం 51,701 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి 49,558 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే తూర్పుగోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 14,696 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. క‌ర్నూలులో 12,234, గుంటూరులో 10,747, అనంత‌పూర్‌లో 10,247 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -