ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదు..

31

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది.. రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఆరుగురు మృతి చెందారు.ఇప్పటివరకు ఏపీలో 20,64,287కు కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు 14,356 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 4,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,45,276 మంది రికవరీ చెందారు. కరోనాతో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.