- Advertisement -
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కరోనా పాజిటివ్ కేసుల్లో ఏపీలో 1,155 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 22 మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది.
ఇక ఏపీలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 21,197కు చేరగా ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 9,745 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఏపీలో 252 మంది మృతిచెందారు.
- Advertisement -