రాష్ట్రంలో నిర్మాణంలో వేలాది చెక్‌డ్యాంలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

41
srinivas goud

రాష్ట్రంలో వేలాదిగా చెక్ డ్యామ్ లు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా దేశంలోనే రాష్ట్రం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేసిందని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని బండరుపల్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా జలకళ సంతరించుకున్న చెక్ డ్యాం కు మంత్రి పుష్పార్చన చేసి గంగమ్మకు నమస్కరించారు. గత పాలకవర్గాల నిర్లక్ష్యం మూలంగా చెక్ డ్యాములు కూడా నిర్మించుకోలేకపోయమన్నారు.

కేసీఆర్, కేటీఆర్ లు రెండు కండ్ల లాంటి వారని, వారి హయాంలో తెలంగాణ మరింత శరవేగంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి సమీప భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి అంగుళం భూమిని సస్యశ్యామలం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.