జగన్ ప్రమాణాస్వీకారానికి చీఫ్ గెస్ట్ గా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత

283
Kcr Jagan
- Advertisement -

ఎప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ 16 పార్లమెంట్ స్ధానాలు గెలుస్తామని ధీమాగా ఉంది.. ఇక ఏపీలో మాత్రం ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. గెలుపు పై ఇరు పార్టీలు చాలా నమ్మకంతో ఉన్నాయి. కొన్ని సర్వేల్లో మాత్రం వైసిపి పార్టీ అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రాలో సర్వే చేపించాడట.

అందులో ఈసారి జగన్ ఎక్కువ సీట్లు గెలుచుకోబుతున్నట్లు సర్వేలో తేలిందని సమచారం. ఇటివలే ప్రగతిభవన్‌లో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో భేటీ జరిగింది. ఆ సమయంలోనే కేసీఆర్ ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో ఈసారి చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అని కాబోయే సీఎం జగనేనని మొదటి నుంచి సీఎం కేసీఆర్ చెబుతున్న విషయం తెలిసిందే.

మే 23న వెలువడే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయని.. జగన్ ప్రమాణ స్వీకారానికి తనతో పాటు కవిత కూడా హాజరవుతుందని చెప్పారని అంటున్నారు. ఇప్పటి వరకూ తాను చేయించిన సర్వేల్లో ఏది ఫెయిల్ కాలేదని..ఏపీలో చేసిన సర్వే కూడా వందశాతం నిజమవుతుందని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట సీఎం కేసీఆర్.

- Advertisement -