టీటీడీ బోర్డు మెంబర్‌గా టీఆర్ఎస్‌ నేత..?

489
ponguleti jagan
- Advertisement -

టీఆర్ఎస్‌ నేత,ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ గూటికి చేరారు.

అప్పటినుంచి పార్టీలో కీలకనేతగా ఉంటూ వస్తున్న పొంగులేటి..పలుమార్లు వైఎస్ జగన్‌పై ప్రశంసలు గుప్పించారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది జగన్‌ అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటికి టీటీడీ బోర్డ్ సభ్యుడి పదవిని జగన్ ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.

టీటీడీ బోర్డు సభ్యుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించే ఆనవాయితీలో భాగంగా తెలంగాణ నుంచి పొంగులేటికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించి పొంగులేటికి సమాచారం అందిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. త్వరలో ఇందుకుసంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

మొత్తంగా టీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న పొంగులేటికి టీటీడీ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పిస్తారనే వార్త రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -