భారీ వర్షాలు..సీఎం చంద్రబాబు కీలక రివ్యూ

4
- Advertisement -

ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో వరుస రివ్యూలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. అధికారుల నుండి సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.

విజయవాడలో ఇవాళ సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఆదేశించారు.

బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ ముంపు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Also Read:మళ్లీ ఉగ్రరూపం దాల్సిన గోదావరి..

- Advertisement -