- Advertisement -
రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాకు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు సైదీ బయలు దేరారు మోదీ. సౌదీ అరేబియా ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ అందించిన ఆహ్వానం మేరకు సౌదీ వెళ్లగా పర్యటనలో భాగంగా వివిధ కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
భారత్-సౌదీ అరేబియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. సౌదీలో ఉన్న భారతీయులను మోదీ కలిసే అవకాశం ఉంది.
మోదీ సౌదీలో పర్యటించడం ఇది మూడోసారి. గతంలో 2016,2019 సంవత్సరాల్లో సౌదీ అరేబియాను సందర్శించారు మోదీ. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు
- Advertisement -

